ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు రంగనాథ్ స్వర్గస్థులయ్యారు - తెలుగు చిత్ర

Breaking

12/20/2015

ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు రంగనాథ్ స్వర్గస్థులయ్యారు

Actor Ranganath still

ప్రముఖ నటుడు రంగనాథ్ గారు నేటి సాయంత్రం కవాడిగూడ అయన నివాసంలో తుది శ్వాస విడిచారు. వారి వయసు 66 సంవత్సరాలు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రంగనాథ్ గారి పూర్తీ పేరు "తిరుమల సుందర శ్రీ రంగనాథ్", 1949 మదరాసులో జన్మించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వా విద్యాలయంలో B.A. పట్టా పొందారు. తదనంతరం భారతీయ రైల్వే లో టికెట్ కలెక్టర్ గా పని చేశారు. 


1969లో బుద్ధిమంతుడు అను  చిత్రంలో చిన్న పాత్రలో మెరిసారు. తరువాత ప్రముఖ నటుడు గిరి బాబు గారి ప్రోత్సాహంతో చందన చిత్రంలో కథానాయకుడిగా అవకాశం వచ్చింది. అలా మొదలైన ప్రస్థానం  జామిందరుగారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందామే  ఆనందం మొదలుకొని సుమారు 300 వందల చిత్రలలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ  నటుడిగా అందరి మన్ననలు పొందారు.  ఆయన చివరి చిత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర

తెలుగు చిత్రాలతోనే పరిమితం కాకుండా బుల్లి తెరలోను తన ఉనికి చాటుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం మొదలు కొని, ఇద్దరు  అమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో ధారావాహికం లో నటించారు. 


రంగనాథ్ గారు నటనలో బిజీగా  ఉన్న వారు అటతుగా ఇవాళ సాయంత్రం మృతి చెందారు. వారు ఆత్మాహత్య చేసుకున్నారు. వారు చనిపోవటం చలనచిత్ర నటులు ఆత్మీయులను కోల్పోయాము అని దిగ్బ్రాంతి చెందుతున్నారు. వారికి మృతికి సిని పెద్దలు, సిని మండలి ప్రగడ సంతాపం తెలుపుతున్నారు. వారితో పాటు మా తెలుగు చిత్రా కూడా మహా నటుడికి ఘన నివాళి. 


 ..  తన ఆత్మ శాంతి కలగాలని తెలుగు చిత్రా దేవుని ప్రార్ధిస్తుంది ..

No comments: