ఈ సంక్రాంత్రి బాక్స్ ఆఫీసు రాజు "అక్కినేని నాగార్జున" సోగాడే చిన్ని నాయన విజయాని ఆనందిస్తున్నాడు. IANS తో అక్కినేని నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూ లో వారి కుమారుల కోసం కొన్ని విషయాలు చెప్పారు. అది ఏంటంటే "వారు తమ పూర్తి సమయం నటన కేటాయించటం, వారి పాత్ర, చిత్ర ఎంపిక మరియు వారి జయ అపజయలను మరియు వారి వైఫల్యాలు పరిష్కరించేందుకు పూర్తి స్వయ బాధ్యత వారికే ఇచ్చారు. ఇందులో తను ఎటువంటి జోక్యం చేసుకోనని చెప్పరు. “వారి వైఫల్యాలను పరిష్కారించే సామర్ధ్యం వారికి రావాలని కోరుకుంటున్నా . నాకు చాల ఫ్లాప్స్ ఉన్నాయి, నేను వాటిని నేర్చుకున్నాటు వాళ్ళు కూడా వారి ఫ్లాప్స్ నుంచి వారు నేర్చుకోవాలని తనలాగా “
గత సంవత్సరం, నాగార్జున శోభాయమానంగా తన రెండో కుమారుడు అఖిల్ ని తొలి చిత్రం "అఖిల్" తో తెరగేట్రం చేసారు . కానీ, అది అందరిని నిరాశపరిచింది.
"ఆ చిత్రం మంచి చెడో తెలిదు, కానీ మేము అందరమూ పూర్తిగా నిరాశే చెందాము. నేను, ఆ షాక్ నుంచి తేరుకోవటానికి వారాలు పట్టింది. మేము ఆ పరాజయాని అంగీకారించము , "అని అన్నారు.
నాగార్జున తన కుమారులు సినీ ఎంపికలో జోక్యం చేసుకోబోమని అని చెప్పారు అయితే, అతను ఎల్లప్పుడూ సలహాలను ఇవ్వడానికి ఇష్టమని చెప్పారు.
"నాగచైతన్య ప్రస్తుతం మలయాళం సూపర్హిటైన “ప్రేమం” చిత్రంను తెలుగులో "మజ్ను", పేరుతో రీమేక్ చేస్తున్నారు. నేను “ప్రేమం” చూసినప్పుడు, నాకు ఒక అందమైన చిత్రంగా అనుభూతి కలిగింది, చైతన్యకు ఈ చిత్రం పరిపూర్ణంగా సరితుగుతాడు అని మేము అది రీమేక్ నిర్ణయించుకున్నాము, కానీ తనపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేదు. "
అక్కినేని త్రయం స్వర్గీయ నాగేశ్వర రావు, నాగార్జున మరియు నాగ చైతన్య 2014 లో “మనం” చిత్రంలో నటించారు. మరోసారి అలాంటి అవకాశం వస్తే తను తన కొడుకులతో నటించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.
నాగార్జున కోరుకున్న విధంగా నాగ చైతన్య మరియు అఖిల్ ఇద్దరు మనో దైర్యంతో ముందడుగు వేసుకుంటూ భవిష్యతులో విజయాలు పొందాలని అభిమానులు కోరుకుందాం.
No comments:
Post a Comment