'దిల్ వాలే': సినిమా కేవలం షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ ✯✯3/4 - తెలుగు చిత్ర

Breaking

12/18/2015

'దిల్ వాలే': సినిమా కేవలం షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ ✯✯3/4



Dilwale Logo
దిల్ వాలే: సినిమా షారుఖ్ ఖాన్ మరియు కాజోల్  ✯✯3/4 

బ్యానర్స్: చిల్లీస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ మరియు రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్
తారాగణం: షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ సంజయ్ మిశ్రా, వరుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, ముఖేష్ తివారి
సంగీతం: అమర్ మొహిలే పాటలు: ప్రీతమ్ చక్రవర్తి
సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య  సినిమాటోగ్రఫీ: డడ్లీ
నిర్మాత: గౌరీ ఖాన్ షారుఖ్ ఖాన్, రోహిత్ శెట్టి  దర్శకుడు: రోహిత్ శెట్టి


ముందుగా:  
దిల్ వాలే ప్రధాన ఆకర్షణ షారుఖ్ ఖాన్ మరియు కాజోల్. సుదీర్ఘ విరామం తర్వాత  "దిల్ వాలే" తో మనని అలరించటానికి వచ్చారు. ఈ చిత్రం చూడటానికి ప్రధాన కారణం కూడా వాలే. ఈ దిల్ వాలే జంట నుంచి మ్యాజిక్ ఆశించటం సహజం. మరి వారు ఆ మ్యాజిక్ చేసారా లేక నిరాశ పరిచారా చూడం.

కథ: 
రాజ్ (షారుఖ్ ఖాన్) aka కాళీ తన ప్రియమైన తమ్ముడు వీర్ (వరుణ్ దవన్) మరియు తన ఇద్దరు స్నేహితులు అన్వర్ (పంకజ్ త్రిపాఠి) మరియు శక్తి (ముఖేష్ తివారి) తో తన 15 సంవత్సరాల జీవిత అంతర్గత రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా ఒక ప్రశాంతమైన జీవితం సాగిస్తాడు. రాజ్ తన తమ్ముడితో కలిసి పాత కార్లను మరమత్తు చేసి వాటిని కొత్తదానిలా తయారు చేసే గ్యారేజీ నడుపుతుంటాడు.  వీర్ కి ఒక స్నేహితుడు సిద్ధూ (వరుణ్ శర్మ) మరియు మణి (జానీ లీవర్) తో కలిసి అల్లరి చేస్తూ అన్న అంటే అభిమానం తో జీవితాని ఎంజాయ్ చేస్తుంటాడు.

అలా వాళ్ళ జీవితాలు సాఫీగా నడుస్తున్న సమయములో,  ఇషిత (కృతి సనన్) వీర్ జీవితం లో కి వస్తుంది. ఇషిత చూసి మనసు పారేసుకొని వీర్, తన స్నేహితులు సిద్దు మరియు మణితో కలిసి ఇషితను కూడా తనను  ప్రేమించేలా చేసుకుంటాడు. అలా ప్రేమలో ఉన్న వీరికి వారదిల మీరా (కాజోల్) ఇషిత అక్క వస్తుంది. కారణం వీర్ రాజ్ తమ్ముడు అని కారణం. మీరా ఎవరు వాళ్ళిద్దరి మధ్య వారది ఎందుకు అయింది. ఇంతకీ మీరాకు రాజ్  మధ్య సంబంధం ఏంటి అనేదే కథ....?


కళాకారుల నటన:  
ముందుగా చెప్పుకోవాల్సింది మన హీరో షారుఖ్ ఖాన్, ఇందులో రాజ్ గా మరియు కాళీ గా జీవించేసాడు. అతని నటనతో ఈ చిత్రం మొత్తని తన  భుజాలపై  మోసాడు. ఇక అతని ప్రేమిక మన మీరాగా నటించిన కాజోల్ మరియు వారి జంట మనసు పులకింప చేసింది. 

షారుఖ్ ఖాన్ సరితూగ నటించిన 1990 బ్యాక్ డ్రాప్ లో కొన్ని చోట్ల ఇద్దరి మధ్య మెరుపు మరియు కొంచెం నీరాసించింది.

వీర్ గా  వరుణ్  తన నటన శక్తిని  నీరు కార్చెసాడు మరియు చాలా సన్నివేశాల్లో అతి ప్రదర్శించాడు. అతని మూస ధోరణి తమ్ముడి పాత్ర లో కొత్తదనం లోపించింది.

కీర్తి సనన్ ఇషితగా , వీర్ ప్రేయసిగా గట్టిగానే తన ఉనికిని చాటుకుంది. ఆమె సహజమైన అందాలూ ప్లస్ అయ్యాయి.

వరుణ్ శర్మ, ఒక నిరాశ  పరిచే పాత్ర పోషించాడు. మణిగా  జానీ లీవర్, తన అసాధారణ నటన శైలిలో అలరించాడు. ఆస్కార్గా సంజయ్ మిశ్రా, అతను ఏదో ఒక కొత్తగా  తెరపై ప్రతిసారీ ప్రదర్శిస్తూ ఉంటారు.  రాజుగా బోమన్ ఇరానీ, ఒక హాస్య ఆవతరం మార్క్ తీసుకొచ్చారు, కానీ వారి మధ్య హాస్యం ఒక అల్పమైన మూస దోరణి వచ్చింది. బల్గేరియా డాన్ రణ్ధీర్ బక్షి గా వినోద్ ఖన్నా, పాత్ర వ్యర్థ పూరితం.

సాంకేతిక విశేషాలు: 
రోహిత్ శెట్టి ఈ చిత్రానికి పూర్తీ న్యాయం మరియు పూర్తిగా నటులను ఉపయోగించలేకపోయడు. కాని కింగ్ ఖాన్ రోహిత్ శెట్టి కలయిక వలన ఒక మెగా వినోదం ఆశించే వాళ్ళకు కొంత నిరాశే మిగులుతుంది.
1990 బ్యాక్ డ్రాప్ కథ, సెట్టింగ్స్ వాటి సంబంధించిన  కథనం అంత బోర్ కొట్టిస్తుంది. ఇక్కడ దర్శకుడిగా తన ప్రదర్శన మరియు సత్తా చాటలేక పోయాడు.

సంగీతం కోస్తే  ప్రీతం, అమర్ మొహిలే నిరాశే.

సాంకేతికాని ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది.

కానీ సినిమాటోగ్రాఫర్ డడ్లీ నీ మెచ్చుకోవాలి. బల్గేరియ అందాల్ని మరియు "Gerua" పాట చిత్రీకరణను అందంగా చిత్రీకరించారు. పోరాట సన్నివేశాలు ఒకే.

మొత్తానికి "దిల్ వాలే" షారుక్ ఖాన్ కాజోల్ అభిమానులకు నచ్చుతుంది  ఉంది. మిగత వారికీ ఒక సాధారణ చిత్రంగా అనిపిస్తుంది.


No comments: