తెలుగు చిత్ర

Breaking

9/12/2022

9/12/2022

అవేంజర్స్: ఎండ్‌గేమ్ చివరికి అవతార్ పై విజయం సాధించింది

అవేంజర్స్: ఎండ్‌గేమ్  చివరికి అవతార్ పై విజయం  



అవతార్ పది సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న  రికార్డు ని, అవేంజర్స్: ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. ఈ  శనివారం మార్వెల్ స్టూడియో యొక్క కామిక్-కాన్ ప్యానెల్‌లో అధికారికంగా ప్రకటించారు, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ఈ వారాంతంలో అవతార్ యొక్క 2.7897 బిలియన్ల అనగా సుమారు ₹19250 కోట్ల రూపాయల  ప్రపంచ బాక్సాఫీస్‌ను బీట్ చేస్తూ అతిపెద్ద చిత్రంగా మొదట స్థానాన్ని కైవసం చేసుకుంది. నిలిచింది. 



"మీకు ధన్యవాదాలు, అవేంజర్స్: ఎండ్‌గేమ్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద చిత్రం" అని కి ఫీజ్ (Fiege) చెప్పారు.

6/26/2016

6/26/2016

ఈ బాబు నిజంగా బంగారం

Babu Bangaram Still

అందరిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. సినిమా అవుట్ అండ్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోనర్ తో ముగిసింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా మరియు అందాల తార నయనతార అతని ప్రేయసి. డైరెక్టర్ మారుతి ఈ చిత్రంకి  కెప్టెన్. నిర్మాత ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల నుంచి సుమారు 0.86 మిలియన్ల ప్రేక్షకుల ఈ టీజర్ని చూసారు. టీజర్ ఎంత ఆకర్షిస్తుందో తెలుస్తుంది.  

లక్ష్మి, తులసి తరువాత, ఇరువురికి ఇది మూడవ చిత్రం. ప్రధాన నటులు 30 ఇయర్స్ పృథ్వీ, పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిషోర్ ప్రేమ ఆసరాగా ఉంటూ మంచి హాస్య కామెడీ ట్రాక్ నడిపే ఉన్నాయిట. ఈ సినిమాకి  ఇది ఆసక్తికరమైన పాయింట్లు.

ఇది కేవలం ఏ మలుపు లేని సాధారణ కుటుంబం ప్రేక్షకులకు మంచి హాస్య కలిగించే చిత్రం. వెంకటేష్ చాలా రోజుల తరువాత మళ్ళీ ఆడవాళ్లను థియటర్ కు రప్పించే చిత్రం ఇది.  

సంగీత దర్శకుడు ఘిబ్రన్,  ప్రతి సన్నివేశంని ఎలివేట్ చేసేలా దీనికి మంచి నేపథ్య సంగీతం అందించాడు. ఈ టీజర్ లో మంచి రొమాంటిక్ థీమ్ వినిపిస్తుంది దాని అర్థం మరోసారి తనను ప్రూఫ్ చేసుకోబుతున్నాడు.


ఇప్పుడు, సినిమా ఆడియో మరియు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఆడియో జులై 9న మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో 28న ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

1/19/2016

1/19/2016

ఆసిన్ ను పరిణయమాడిన మైక్రోమ్యాక్స్ “రాహుల్ శర్మ”

Mr & Mrs Asin Rahul Sharma

ప్రముఖ నటి “ఆసిన్ తొట్టుంకళ్ (30)” ని ప్రముఖ వ్యాపారవేత మైక్రోమ్యక్స్ “రాహుల్ శర్మ (39)” క్రైస్తవ (ముందు) మరియు హిందూ (తరువాత) మతం ఆచారాలు విధంగా వివాహం చేసుకున్నారు.  30 ఏళ్ల "గజిని" సుందరి అతి సాధారణ అంగు అర్బాతం లేకుండా కేవలం కుటుంబసభ్యులు మరియు అతి సన్నిహితులు సమక్షంలో ఓక రిసార్ట్ హోటల్ వివాహం జరుపుకున్నది.

మొదట సుమారు ఉదయం 11లకు  కాథలిక్ శైలిలో  వివాహం  జరిగింది. ఈ వేడుకలో వధువు (తెల్ల గౌను), వరుడు (నల్ల సూటు, బో టై లో) క్రైస్తవ సంప్రదాయ బద్దంగా అందంగా అందరిని మయిమరిపించారు.
“ఈ వివాహం అసిన్ కోరిక మేరకు క్రైస్తవ పద్దతిలో అందంగా, అలరించేలా జరిగింది అని, మా అందరికి సంతోషమే అని” ప్రముఖ  వ్యాపారవేత్త వరుడు రాహుల్ శర్మ బంధువు తెలిపారు. “వివాహం నిర్విగ్నంగా జరిగింది అని, అసిన్ తెల్ల గౌన్ లో మరింత అందంగా ఉందని ఈ పెళ్లి కోసం మేము నిన్నటి నుంచి రిహార్సల్ చేసాము అని, ఇంకా 2-3  పాటలు వివాహ జంట కోసం ఆలాపించం అని” సంగీత విధ్వసులు పెరుకున్నారు.   
ఈ పెళ్లి ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్  మరియు అతి సన్నిహితుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు.  దిల్లికి చెందినా ప్రముఖ Elohim Worship సంగీత బృందం వివాహ సంగీత సారధ్యం వహించారు.  ఈ పెళ్లికి అక్షయ్ మరియు వారి సహకారం  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒక ప్రైవేటు వివాహ గేట్-టుగేదర్ రాహుల్ ఫామ్ హౌస్ వద్ద రేపు జరుగుతాయి భావిస్తున్నారు. తరువాత జంట ప్రతేక్య  రిసెప్షన్ ముంబైలో చేయనున్నరు.

1/17/2016

1/17/2016

తన కుమారులు వారి వైఫల్యలను ఎదుర్కోవాలి అంటున్న నాగార్జున

Nagarjuna Akhil Naga chaitanya


  ఈ సంక్రాంత్రి బాక్స్ ఆఫీసు రాజు "అక్కినేని  నాగార్జున" సోగాడే చిన్ని నాయన విజయాని ఆనందిస్తున్నాడు.  IANS తో అక్కినేని నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూ లో వారి కుమారుల కోసం కొన్ని విషయాలు చెప్పారు. అది ఏంటంటే "వారు తమ పూర్తి సమయం నటన కేటాయించటం, వారి పాత్ర, చిత్ర ఎంపిక మరియు  వారి జయ అపజయలను మరియు వారి వైఫల్యాలు పరిష్కరించేందుకు పూర్తి స్వయ బాధ్యత వారికే ఇచ్చారు. ఇందులో తను ఎటువంటి జోక్యం చేసుకోనని చెప్పరు.  వారి వైఫల్యాలను  పరిష్కారించే సామర్ధ్యం వారికి రావాలని కోరుకుంటున్నా . నాకు చాల ఫ్లాప్స్ ఉన్నాయి, నేను వాటిని నేర్చుకున్నాటు వాళ్ళు కూడా వారి ఫ్లాప్స్ నుంచి వారు నేర్చుకోవాలని తనలాగా 

గత సంవత్సరం, నాగార్జున శోభాయమానంగా తన రెండో కుమారుడు అఖిల్ ని తొలి చిత్రం "అఖిల్"  తో తెరగేట్రం చేసారు . కానీ, అది అందరిని నిరాశపరిచింది.
  
"ఆ చిత్రం మంచి చెడో తెలిదు, కానీ మేము అందరమూ పూర్తిగా నిరాశే చెందాము. నేను, ఆ షాక్ నుంచి తేరుకోవటానికి వారాలు పట్టింది. మేము ఆ పరాజయాని అంగీకారించము , "అని  అన్నారు.                                        

నాగార్జున తన కుమారులు సినీ ఎంపికలో జోక్యం చేసుకోబోమని అని చెప్పారు అయితే, అతను ఎల్లప్పుడూ సలహాలను ఇవ్వడానికి  ఇష్టమని చెప్పారు.

"నాగచైతన్య ప్రస్తుతం మలయాళం సూపర్హిటైన “ప్రేమం”  చిత్రంను  తెలుగులో  "మజ్ను", పేరుతో రీమేక్  చేస్తున్నారు.  నేను “ప్రేమం” చూసినప్పుడు, నాకు ఒక అందమైన చిత్రంగా అనుభూతి కలిగింది, చైతన్యకు ఈ చిత్రం పరిపూర్ణంగా సరితుగుతాడు అని మేము అది రీమేక్ నిర్ణయించుకున్నాము, కానీ తనపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేదు. "

అక్కినేని త్రయం స్వర్గీయ నాగేశ్వర రావు, నాగార్జున మరియు నాగ చైతన్య 2014 లో మనంచిత్రంలో నటించారు.  మరోసారి  అలాంటి అవకాశం వస్తే తను తన కొడుకులతో నటించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.

నాగార్జున కోరుకున్న విధంగా నాగ చైతన్య మరియు అఖిల్ ఇద్దరు మనో దైర్యంతో ముందడుగు వేసుకుంటూ భవిష్యతులో విజయాలు పొందాలని అభిమానులు కోరుకుందాం.

12/20/2015

12/20/2015

ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు రంగనాథ్ స్వర్గస్థులయ్యారు

Actor Ranganath still

ప్రముఖ నటుడు రంగనాథ్ గారు నేటి సాయంత్రం కవాడిగూడ అయన నివాసంలో తుది శ్వాస విడిచారు. వారి వయసు 66 సంవత్సరాలు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రంగనాథ్ గారి పూర్తీ పేరు "తిరుమల సుందర శ్రీ రంగనాథ్", 1949 మదరాసులో జన్మించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వా విద్యాలయంలో B.A. పట్టా పొందారు. తదనంతరం భారతీయ రైల్వే లో టికెట్ కలెక్టర్ గా పని చేశారు. 


1969లో బుద్ధిమంతుడు అను  చిత్రంలో చిన్న పాత్రలో మెరిసారు. తరువాత ప్రముఖ నటుడు గిరి బాబు గారి ప్రోత్సాహంతో చందన చిత్రంలో కథానాయకుడిగా అవకాశం వచ్చింది. అలా మొదలైన ప్రస్థానం  జామిందరుగారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందామే  ఆనందం మొదలుకొని సుమారు 300 వందల చిత్రలలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ  నటుడిగా అందరి మన్ననలు పొందారు.  ఆయన చివరి చిత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర

తెలుగు చిత్రాలతోనే పరిమితం కాకుండా బుల్లి తెరలోను తన ఉనికి చాటుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం మొదలు కొని, ఇద్దరు  అమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో ధారావాహికం లో నటించారు. 


రంగనాథ్ గారు నటనలో బిజీగా  ఉన్న వారు అటతుగా ఇవాళ సాయంత్రం మృతి చెందారు. వారు ఆత్మాహత్య చేసుకున్నారు. వారు చనిపోవటం చలనచిత్ర నటులు ఆత్మీయులను కోల్పోయాము అని దిగ్బ్రాంతి చెందుతున్నారు. వారికి మృతికి సిని పెద్దలు, సిని మండలి ప్రగడ సంతాపం తెలుపుతున్నారు. వారితో పాటు మా తెలుగు చిత్రా కూడా మహా నటుడికి ఘన నివాళి. 


 ..  తన ఆత్మ శాంతి కలగాలని తెలుగు చిత్రా దేవుని ప్రార్ధిస్తుంది ..

12/18/2015

12/18/2015

'దిల్ వాలే': సినిమా కేవలం షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ ✯✯3/4



Dilwale Logo
దిల్ వాలే: సినిమా షారుఖ్ ఖాన్ మరియు కాజోల్  ✯✯3/4 

బ్యానర్స్: చిల్లీస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ మరియు రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్
తారాగణం: షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ సంజయ్ మిశ్రా, వరుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, ముఖేష్ తివారి
సంగీతం: అమర్ మొహిలే పాటలు: ప్రీతమ్ చక్రవర్తి
సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య  సినిమాటోగ్రఫీ: డడ్లీ
నిర్మాత: గౌరీ ఖాన్ షారుఖ్ ఖాన్, రోహిత్ శెట్టి  దర్శకుడు: రోహిత్ శెట్టి


ముందుగా:  
దిల్ వాలే ప్రధాన ఆకర్షణ షారుఖ్ ఖాన్ మరియు కాజోల్. సుదీర్ఘ విరామం తర్వాత  "దిల్ వాలే" తో మనని అలరించటానికి వచ్చారు. ఈ చిత్రం చూడటానికి ప్రధాన కారణం కూడా వాలే. ఈ దిల్ వాలే జంట నుంచి మ్యాజిక్ ఆశించటం సహజం. మరి వారు ఆ మ్యాజిక్ చేసారా లేక నిరాశ పరిచారా చూడం.

కథ: 
రాజ్ (షారుఖ్ ఖాన్) aka కాళీ తన ప్రియమైన తమ్ముడు వీర్ (వరుణ్ దవన్) మరియు తన ఇద్దరు స్నేహితులు అన్వర్ (పంకజ్ త్రిపాఠి) మరియు శక్తి (ముఖేష్ తివారి) తో తన 15 సంవత్సరాల జీవిత అంతర్గత రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా ఒక ప్రశాంతమైన జీవితం సాగిస్తాడు. రాజ్ తన తమ్ముడితో కలిసి పాత కార్లను మరమత్తు చేసి వాటిని కొత్తదానిలా తయారు చేసే గ్యారేజీ నడుపుతుంటాడు.  వీర్ కి ఒక స్నేహితుడు సిద్ధూ (వరుణ్ శర్మ) మరియు మణి (జానీ లీవర్) తో కలిసి అల్లరి చేస్తూ అన్న అంటే అభిమానం తో జీవితాని ఎంజాయ్ చేస్తుంటాడు.

అలా వాళ్ళ జీవితాలు సాఫీగా నడుస్తున్న సమయములో,  ఇషిత (కృతి సనన్) వీర్ జీవితం లో కి వస్తుంది. ఇషిత చూసి మనసు పారేసుకొని వీర్, తన స్నేహితులు సిద్దు మరియు మణితో కలిసి ఇషితను కూడా తనను  ప్రేమించేలా చేసుకుంటాడు. అలా ప్రేమలో ఉన్న వీరికి వారదిల మీరా (కాజోల్) ఇషిత అక్క వస్తుంది. కారణం వీర్ రాజ్ తమ్ముడు అని కారణం. మీరా ఎవరు వాళ్ళిద్దరి మధ్య వారది ఎందుకు అయింది. ఇంతకీ మీరాకు రాజ్  మధ్య సంబంధం ఏంటి అనేదే కథ....?


కళాకారుల నటన:  
ముందుగా చెప్పుకోవాల్సింది మన హీరో షారుఖ్ ఖాన్, ఇందులో రాజ్ గా మరియు కాళీ గా జీవించేసాడు. అతని నటనతో ఈ చిత్రం మొత్తని తన  భుజాలపై  మోసాడు. ఇక అతని ప్రేమిక మన మీరాగా నటించిన కాజోల్ మరియు వారి జంట మనసు పులకింప చేసింది. 

షారుఖ్ ఖాన్ సరితూగ నటించిన 1990 బ్యాక్ డ్రాప్ లో కొన్ని చోట్ల ఇద్దరి మధ్య మెరుపు మరియు కొంచెం నీరాసించింది.

వీర్ గా  వరుణ్  తన నటన శక్తిని  నీరు కార్చెసాడు మరియు చాలా సన్నివేశాల్లో అతి ప్రదర్శించాడు. అతని మూస ధోరణి తమ్ముడి పాత్ర లో కొత్తదనం లోపించింది.

కీర్తి సనన్ ఇషితగా , వీర్ ప్రేయసిగా గట్టిగానే తన ఉనికిని చాటుకుంది. ఆమె సహజమైన అందాలూ ప్లస్ అయ్యాయి.

వరుణ్ శర్మ, ఒక నిరాశ  పరిచే పాత్ర పోషించాడు. మణిగా  జానీ లీవర్, తన అసాధారణ నటన శైలిలో అలరించాడు. ఆస్కార్గా సంజయ్ మిశ్రా, అతను ఏదో ఒక కొత్తగా  తెరపై ప్రతిసారీ ప్రదర్శిస్తూ ఉంటారు.  రాజుగా బోమన్ ఇరానీ, ఒక హాస్య ఆవతరం మార్క్ తీసుకొచ్చారు, కానీ వారి మధ్య హాస్యం ఒక అల్పమైన మూస దోరణి వచ్చింది. బల్గేరియా డాన్ రణ్ధీర్ బక్షి గా వినోద్ ఖన్నా, పాత్ర వ్యర్థ పూరితం.

సాంకేతిక విశేషాలు: 
రోహిత్ శెట్టి ఈ చిత్రానికి పూర్తీ న్యాయం మరియు పూర్తిగా నటులను ఉపయోగించలేకపోయడు. కాని కింగ్ ఖాన్ రోహిత్ శెట్టి కలయిక వలన ఒక మెగా వినోదం ఆశించే వాళ్ళకు కొంత నిరాశే మిగులుతుంది.
1990 బ్యాక్ డ్రాప్ కథ, సెట్టింగ్స్ వాటి సంబంధించిన  కథనం అంత బోర్ కొట్టిస్తుంది. ఇక్కడ దర్శకుడిగా తన ప్రదర్శన మరియు సత్తా చాటలేక పోయాడు.

సంగీతం కోస్తే  ప్రీతం, అమర్ మొహిలే నిరాశే.

సాంకేతికాని ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది.

కానీ సినిమాటోగ్రాఫర్ డడ్లీ నీ మెచ్చుకోవాలి. బల్గేరియ అందాల్ని మరియు "Gerua" పాట చిత్రీకరణను అందంగా చిత్రీకరించారు. పోరాట సన్నివేశాలు ఒకే.

మొత్తానికి "దిల్ వాలే" షారుక్ ఖాన్ కాజోల్ అభిమానులకు నచ్చుతుంది  ఉంది. మిగత వారికీ ఒక సాధారణ చిత్రంగా అనిపిస్తుంది.