తెలుగు చిత్ర

Breaking

5/25/2025

5/25/2025

ఈషా రెబ్బా బంగారపు పందెం

 వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో ఉత్సాహం నింపిన ఈషా రెబ్బ

▪️ శరత్ సిటీ మాల్‌లో జరుగుతున్న ఘనమైన కార్యక్రమం

హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ షాపింగ్ కేంద్రం శరత్ సిటీ మాల్ (AMB మాల్, కొండాపూర్‌)లో వింధ్య గోల్డ్ నిర్వహిస్తున్న సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా రెబ్బ సందడి చేశారు. మే 23 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 25వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఈషా రెబ్బ మాట్లాడుతూ, "ఈ ఈవెంట్ బంగారం వంటి అద్భుతమైన వేడుక. చాలా ఆకర్షణీయంగా, రంగురంగులగా జరుగుతోంది. ఇలాంటి సరికొత్త కార్యక్రమాలు అందరికీ మరపురాని అనుభవాన్ని అందిస్తాయి. వింధ్య గోల్డ్ వంటి విశ్వసనీయ బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం దీని ప్రత్యేకతను మరింత పెంచింది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్తుకు బంగారు హామీలాంటిది," అని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఈషా రెబ్బ సందర్శకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని, వారిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఛాలెంజ్‌లో గెలిచినవారికి బంగారు, వెండి నాణేలను బహుమతులుగా అందించడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వింధ్య గోల్డ్, నాణ్యమైన ఆభరణాలను అందరికీ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్‌కు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచింది. భారీ సంఖ్యలో సందర్శకులు హాజరై ఈవెంట్‌ను విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

5/24/2025

5/24/2025

హీరోయిన్ ని ఎందుకు తప్పించారు, హీరో మంచి మనసు నిదర్శనం?

 స్పిరిట్ చిత్రం నుండి దీపికా పదుకొణె ఎందుకు తప్పుకున్నారు?


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రం గురించి ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, దీపికా ఈ చిత్రం నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని, అవి సినిమా యొక్క కథాంశం, సంస్కృతి, ప్రభాస్ యొక్క రాజా మనసు మరియు అయన యొక్క వ్యక్తిగత నీతి నియమాలతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా తన చిత్రాలలో బోల్డ్ సన్నివేశాలు మరియు హద్దులు దాటే దృశ్యాలను చూపించడంలో పేరుగాంచారు. 'అర్జున్ రెడ్డి' మరియు 'అనిమల్' వంటి చిత్రాలు ఈ విషయంలో ఉదాహరణగా నిలుస్తాయి. అయితే, 'స్పిరిట్' చిత్రంలో కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. ఇది ప్రభాస్‌కు అసౌకర్యంగా అనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, తన చిత్రాలలో సంస్కృతి మరియు సాంప్రదాయ విలువలకు ప్రాధాన్యత ఇస్తారని అభిమానులు భావిస్తారు. ముఖ్యంగా, తెలుగు సినిమా సంస్కృతిలో, తల్లిగా ఉన్న మహిళలతో రొమాంటిక్ సన్నివేశాలు చూపించడం సాధారణం కాదని, ఇది సాంప్రదాయ హిందూ విలువలకు విరుద్ధమని కొందరు అంటున్నారు.

దీపికా పదుకొణె ఇటీవల తల్లి అయ్యారు. ఈ సందర్భంలో, ఆమె ఒక తల్లిగా ఉన్న నేపథ్యంలో బోల్డ్ లేదా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం సరైనది కాదని ప్రభాస్ భావించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తల్లులతో రొమాంటిక్ పాత్రలు చేయించటం సర్వసాధారణం అక్కడ వారి ఆచారం, తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం ఇలాంటి సన్నివేశాలు సాంప్రదాయ దృక్కోణంలో అంతగా ఆమోదయోగ్యం కాదని చెబుతారు. హిందూ సంస్కృతి ప్రకారం, రొమాంటిక్ పాత్రలు సాధారణంగా పెళ్లికాని యువతులకు సంబంధించినవిగా చూపించడం సంప్రదాయంగా ఉందని కొందరు నమ్ముతారు.

ప్రభాస్ ఈ విషయంలో తన సాంస్కృతిక విలువలకు కట్టుబడి, సినిమాలో దీపికా పాత్రను తగ్గించాలని లేదా ఆమెను చిత్రం నుండి తప్పించాలని సూచించినట్లు సమాచారం అని వినిపిస్తోంది. ప్రభాస్ గారు దీపిక రణవీర్ సింగ్ గారికి కల్కి లాంటి పాత్ర ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇది ప్రభాస్ యొక్క సాంప్రదాయ నీతి నియమాలకు, హిందూ ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ ఎల్లప్పుడూ తన సినిమాల ద్వారా సమాజానికి సానుకూల సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారని, ఈ నిర్ణయం ఆయన యొక్క గొప్ప మనసును చాటుతుందని అభిమానులు అంటున్నారు.

అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. 'స్పిరిట్' చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లేదా బృందం నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. అయినప్పటికీ, ఈ సంఘటన ప్రభాస్ యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని మరోసారి హైలైట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

కానీ వయసులో పెద్దవారు మరియు సినిమా ఇండస్ట్రీ దిక్సూచి అయినా ప్రభాస్ సమీప బంధువు మెగా స్టార్ చిరంజీవి మాత్రం బాలీవుడ్ సంప్రదాయాన్ని మక్కువ తో ఒకసారి చెల్లి పాత్ర వేసిన ఆవిడా మరియు ఇద్దరి పిల్లల తల్లి అయినా హీరోయిన్ తో రొమాన్స్ కి దిగారు ఇది కొసమెరుపు


5/24/2025

తాత్కాలిక థియేటర్‌ల మూసివేత - వీర మల్లు కోసం మోనోపొలీ వ్యూహం?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాత్కాలిక థియేటర్‌ల మూసివేత: పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కోసం మోనోపొలీ వ్యూహం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి 10 రోజుల పాటు థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రస్తుత రెంటల్ ఆధారిత రెవెన్యూ మోడల్‌పై అసంతృప్తి నేపథ్యంలో వచ్చింది, అయితే ఇది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్లు చిత్రం కోసం ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రం, గతంలో వాయిదా పడినప్పటికీ, ఇప్పుడు థియేటర్లు తిరిగి తెరిచినప్పుడు ఒకే చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించే మోనోపొలీ వ్యూహాన్ని అనుసరించనున్నాయి?.



ఈ మూసివేత వ్యూహం ద్వారా హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) చిత్రానికి హైప్ సృష్టించడంతో పాటు, ఇతర చిత్రాలతో పోటీని తగ్గించి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాకపోయినా కూడా ఆదరణ పొందేలా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యూహం థియేటర్ యజమానులకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రముఖత కారణంగా ఈ చిత్రానికి ఉన్న ఆసక్తిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మోనోపొలీ వ్యూహం ? పరిశ్రమలో ఇతర చిత్రాలకు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి?

12/21/2024

12/21/2024

JSK Janaki vs State of Kerala

  

Suresh Gopi


JSK Janaki vs State of Kerala


సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ




సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పధ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె. ఎస్. కె). బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.




అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి గారు నటించారు. 


ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.




నటీనటులు : సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్


రచన & దర్శకత్వం: ప్రవీణ్ నారాయణన్


నిర్మాత: జె. ఫణీంద్ర కుమార్ 


బ్యానర్: కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ 


సహ నిర్మాతలు: సేతురామన్, హుమాయున్ అలీ అహమ్మద్ 


DOP: రెనదివ్


ఎడిటర్: సంజిత్ మహమ్మద్ 


సంగీతం : గిరీష్ నారాయణన్ , జిబ్రాన్


పి ఆర్ ఓ : మధు VR







Anupama Parameshwaran


Suresh Gopi


12/20/2024

12/20/2024

Deccan Sarkar ఘనంగా జరిగిన మూవీ లాంచ్

'దక్కన్ సర్కార్' (
Deccan Sarkar

Deccan Sarkar) మూవీ పోస్టర్, టీజర్ లాంచ్



కళా ఆర్ట్స్ బ్యానర్‌పై  కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ''తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్య‌మాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాలి. చిత్ర‌యూనిట్‌ను అభినందిస్తున్నాను.'' అని అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''ఇలాంటి సినిమాలను మ‌న‌మంతా ఆహ్వానించాలి. ఈ సినిమాలో నటీనటులు బాగా చేశారు. ఒక సినిమాతో ఎన్నో కుటుంబాల‌కు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఈ సినిమాను హిట్ చేయాల‌ని కోరుతున్నాను. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నా మ‌ద్ద‌తు ఉంటుంది.'' అని అన్నారు.

డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్ప‌ది, ఇక్క‌డి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మాన్ని తెరపై ఆవిష్క‌రించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్ట‌ర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. సాయి చంద్ , జై శ్రీను వంటి తెలంగాణ ఆణిముత్యాలను కోల్పోయాం. ఉద్య‌మ క‌ళాకారుల‌ను, నా ఆత్మీయుల‌ను ఈ సంద‌ర్భంగా త‌లుచుకోవ‌డం భావోద్వేగంగా ఉంది. 'దక్కన్ సర్కార్' ఆడియో లాంచ్ త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము. ఈ సినిమాను ఆద‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రిని కోరుకుంటున్నాను. మా సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మంకు వ‌చ్చిన అతిథుల‌కు, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు, మీడియా మిత్రుల‌కు పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు.'' అని అన్నారు.  

ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం కళా శ్రీనివాస్ ఎంతో శ్రమించారు. సినిమాను తెర‌కెక్కించిన తీరు బాగుంది. సినిమాకు మన అందరి సహకారం అవసరం. చిన్న సినిమాను పెద్ద హిట్ చేయాలి.'' అని అన్నారు.  

నటి హేమ మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఒక మంచి సినిమాను మ‌న ముందు ఉంచారు. ఈ సినిమాను మ‌న‌మంతా ఆద‌రించాలి.  
హీరో చాణక్య మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ త‌న ప్ర‌తిభ‌తో 12 సంవత్సరాల ఉద్యమాన్ని 2 గంటల్లో చూపించారని, తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితాన్ని ప్రతిబింభించేలా చిత్రంలోని సన్నివేశాలు ఉంటాయని.. ప్రస్తుత తెలంగాణా స్థితి గతులను ఆధారంగా చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని ప్రమోట్వా చేయాలని చెప్పారు.
ఒక గొప్ప ప్రయత్నంగా ఈ సినిమాను చేశారని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారు కొనియ‌డారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్న





సినిమా అంటూ కీర్తించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ముఖ్య‌పాత్ర‌లోనూ  డైరెక్టర్ కళ శ్రీనివాస్ పాత్ర ప్ర‌శంసించ‌ద‌గిన‌ద‌ని అన్నారు.

నటి నటులు : చాణక్య, కళా శ్రీనివాస్, కియా రెడ్డి, మౌనిక, ఘర్షణ శ్రీనివాస్, బుగత సత్యనారాయణ, జబర్దస్త్ రాజమౌళి తదితరులు..
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:
క‌ళా శ్రీనివాస్.

బ్యానర్: కళా ఆర్ట్స్
నిర్మాత‌: క‌ళా శ్రీనివాస్
డీవోపీ: భ‌ర‌త్, న‌ర‌హ‌రి
మ్యూజిక్: మ‌ల్లిక్ ఎంవీకే
ఎడిటింగ్: అలోషియ‌స్ సేవియర్ , చాణక్య
డ‌బ్బింగ్: అమూల్య స్టూడియోస్,
డీఏ: తిరు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.


12/20/2024

Mass Hero Sujith Reddy gets International honour

 


విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చేరువైన దూరమైన చిత్ర హీరోకు అవార్డు


యువ హీరో సుజిత్ రెడ్డి రీసెంట్ గా నటించిన చిత్రం "చేరువైన దూరమైన". చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- 2024 గానూ ఉత్తమ డెబ్యూ హీరో కేటగిరిలో ఎంపికైంది., 

ఆ చిత్రంలో నటించిన సుజిత్ రెడ్డి కి ఉత్తమ డిబ్యు హీరోగా అవార్డు వరించింది.

 డిసెంబర్ 29న దాదాపు 14 దేశాల ప్రతినిధులు పాల్గొనున్న విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చిత్ర హీరో సుజిత్ రెడ్డికి ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.





12/20/2024

Alluri Sitarama Raju జీవిత చరిత్ర ఆధారం

alluri sitarama raju


Alluri Sitarama raju జీవిత కథ మన్యం ధీరుడు
బ్రిటీష్ వారి బాని సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా… వెండితెరపై చూసినా…. కొత్తగానే వుంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించారు. మన్యం ధీరుడు (Alluri Sitarama raju ) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి.మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) వారి తుపాకీ గుళ్లకు బలై నెలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి… బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు (Alluri Sitarama raju ) వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి… ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్రం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? గూడేళ్లో వున్న పేద ప్రజల్లో వున్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? స్వాతంత్రోద్యమంలో విప్లవ వీరుల కథలను నేటి యువతకూ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. టెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు ఇలాంటి స్వాతంత్రోద్యమకారుల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ… భావి తరాల వారికి చరిత్ర మరిచిపోకుండా చేయడం మనవంతు. గతంలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం… వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్ కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.
అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం… బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేశాలన్నీ మాస్ ని అలరిస్తాయి. నటుడు రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా వుంది. మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో… బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే… వాళ్లకు పన్ను ఎందుకు కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అనేక అంశాలను ఇందులో చూపించారు. ఇలాంటి వన్నీ యువతకు బాగా మెసేజ్ ఇచ్చేలా వున్నాయి. ఓవరాల్ గా ఈ మన్యం ధీరుడు (Alluri Sitarama raju ) పేరుతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా… బ్రిటీష్ వారిపై పోరాడిన ఓ విప్లవ వీరుడి కథగా ఆకట్టు ఆకట్టుకుంటుంది.
రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో బాగా ఒదిగిపోయారు. ఆహర్యం, డైలాగ్ డెలివరి, డిక్షన్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా విల్లు విద్యలు నేర్చుకుని నటించడం రియల్ స్టిక్ గా వుంది. ఓ యథార్థకథను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడం అభినందనీయం. అలాగే బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ కూడా చివరి దాకా బాగా నటించారు. అతన్ని విడిపించడానికి సీతారామరాజు చేసే ప్రయత్నం… బ్రిటీష్ వారికి, సీతారామరాజుకు (Alluri Sitarama raju ) మధ్య జరిగే భీకర సన్నిశాల్లో మల్లుదొర పాత్ర కూడా ఎంతో ప్రాధన్యత సంతరించుకుంది. జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా… నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నాచురల్ గా వేశారు. అర్ట్ వర్క్ రిచ్ గా వుంది. సినిమాటోగ్రఫీ చాలా నాచురల్ గా వుంది. మన్యం అందాలు, గూడెం ప్రాంతాలను బాగా చూపించారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. బోర్ కొట్టించి కుండ చేసి… చాలా పకడ్బందిగ చేశారు ఓ విప్లవ వీరుడి కథకు కావాల్సిన యాక్షన్ సీన్స్, సంభాషణలన్నీ చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని తెరకెక్కించారు.

9/12/2022

9/12/2022

అవేంజర్స్: ఎండ్‌గేమ్ చివరికి అవతార్ పై విజయం సాధించింది

అవేంజర్స్: ఎండ్‌గేమ్  చివరికి అవతార్ పై విజయం  



అవతార్ పది సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న  రికార్డు ని, అవేంజర్స్: ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. ఈ  శనివారం మార్వెల్ స్టూడియో యొక్క కామిక్-కాన్ ప్యానెల్‌లో అధికారికంగా ప్రకటించారు, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ఈ వారాంతంలో అవతార్ యొక్క 2.7897 బిలియన్ల అనగా సుమారు ₹19250 కోట్ల రూపాయల  ప్రపంచ బాక్సాఫీస్‌ను బీట్ చేస్తూ అతిపెద్ద చిత్రంగా మొదట స్థానాన్ని కైవసం చేసుకుంది. నిలిచింది. 



"మీకు ధన్యవాదాలు, అవేంజర్స్: ఎండ్‌గేమ్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద చిత్రం" అని కి ఫీజ్ (Fiege) చెప్పారు.

6/26/2016

6/26/2016

ఈ బాబు నిజంగా బంగారం

Babu Bangaram Still

అందరిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. సినిమా అవుట్ అండ్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోనర్ తో ముగిసింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా మరియు అందాల తార నయనతార అతని ప్రేయసి. డైరెక్టర్ మారుతి ఈ చిత్రంకి  కెప్టెన్. నిర్మాత ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల నుంచి సుమారు 0.86 మిలియన్ల ప్రేక్షకుల ఈ టీజర్ని చూసారు. టీజర్ ఎంత ఆకర్షిస్తుందో తెలుస్తుంది.  

లక్ష్మి, తులసి తరువాత, ఇరువురికి ఇది మూడవ చిత్రం. ప్రధాన నటులు 30 ఇయర్స్ పృథ్వీ, పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిషోర్ ప్రేమ ఆసరాగా ఉంటూ మంచి హాస్య కామెడీ ట్రాక్ నడిపే ఉన్నాయిట. ఈ సినిమాకి  ఇది ఆసక్తికరమైన పాయింట్లు.

ఇది కేవలం ఏ మలుపు లేని సాధారణ కుటుంబం ప్రేక్షకులకు మంచి హాస్య కలిగించే చిత్రం. వెంకటేష్ చాలా రోజుల తరువాత మళ్ళీ ఆడవాళ్లను థియటర్ కు రప్పించే చిత్రం ఇది.  

సంగీత దర్శకుడు ఘిబ్రన్,  ప్రతి సన్నివేశంని ఎలివేట్ చేసేలా దీనికి మంచి నేపథ్య సంగీతం అందించాడు. ఈ టీజర్ లో మంచి రొమాంటిక్ థీమ్ వినిపిస్తుంది దాని అర్థం మరోసారి తనను ప్రూఫ్ చేసుకోబుతున్నాడు.


ఇప్పుడు, సినిమా ఆడియో మరియు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఆడియో జులై 9న మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో 28న ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

1/19/2016

1/19/2016

ఆసిన్ ను పరిణయమాడిన మైక్రోమ్యాక్స్ “రాహుల్ శర్మ”

Mr & Mrs Asin Rahul Sharma

ప్రముఖ నటి “ఆసిన్ తొట్టుంకళ్ (30)” ని ప్రముఖ వ్యాపారవేత మైక్రోమ్యక్స్ “రాహుల్ శర్మ (39)” క్రైస్తవ (ముందు) మరియు హిందూ (తరువాత) మతం ఆచారాలు విధంగా వివాహం చేసుకున్నారు.  30 ఏళ్ల "గజిని" సుందరి అతి సాధారణ అంగు అర్బాతం లేకుండా కేవలం కుటుంబసభ్యులు మరియు అతి సన్నిహితులు సమక్షంలో ఓక రిసార్ట్ హోటల్ వివాహం జరుపుకున్నది.

మొదట సుమారు ఉదయం 11లకు  కాథలిక్ శైలిలో  వివాహం  జరిగింది. ఈ వేడుకలో వధువు (తెల్ల గౌను), వరుడు (నల్ల సూటు, బో టై లో) క్రైస్తవ సంప్రదాయ బద్దంగా అందంగా అందరిని మయిమరిపించారు.
“ఈ వివాహం అసిన్ కోరిక మేరకు క్రైస్తవ పద్దతిలో అందంగా, అలరించేలా జరిగింది అని, మా అందరికి సంతోషమే అని” ప్రముఖ  వ్యాపారవేత్త వరుడు రాహుల్ శర్మ బంధువు తెలిపారు. “వివాహం నిర్విగ్నంగా జరిగింది అని, అసిన్ తెల్ల గౌన్ లో మరింత అందంగా ఉందని ఈ పెళ్లి కోసం మేము నిన్నటి నుంచి రిహార్సల్ చేసాము అని, ఇంకా 2-3  పాటలు వివాహ జంట కోసం ఆలాపించం అని” సంగీత విధ్వసులు పెరుకున్నారు.   
ఈ పెళ్లి ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్  మరియు అతి సన్నిహితుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు.  దిల్లికి చెందినా ప్రముఖ Elohim Worship సంగీత బృందం వివాహ సంగీత సారధ్యం వహించారు.  ఈ పెళ్లికి అక్షయ్ మరియు వారి సహకారం  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒక ప్రైవేటు వివాహ గేట్-టుగేదర్ రాహుల్ ఫామ్ హౌస్ వద్ద రేపు జరుగుతాయి భావిస్తున్నారు. తరువాత జంట ప్రతేక్య  రిసెప్షన్ ముంబైలో చేయనున్నరు.

1/17/2016

1/17/2016

తన కుమారులు వారి వైఫల్యలను ఎదుర్కోవాలి అంటున్న నాగార్జున

Nagarjuna Akhil Naga chaitanya


  ఈ సంక్రాంత్రి బాక్స్ ఆఫీసు రాజు "అక్కినేని  నాగార్జున" సోగాడే చిన్ని నాయన విజయాని ఆనందిస్తున్నాడు.  IANS తో అక్కినేని నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూ లో వారి కుమారుల కోసం కొన్ని విషయాలు చెప్పారు. అది ఏంటంటే "వారు తమ పూర్తి సమయం నటన కేటాయించటం, వారి పాత్ర, చిత్ర ఎంపిక మరియు  వారి జయ అపజయలను మరియు వారి వైఫల్యాలు పరిష్కరించేందుకు పూర్తి స్వయ బాధ్యత వారికే ఇచ్చారు. ఇందులో తను ఎటువంటి జోక్యం చేసుకోనని చెప్పరు.  వారి వైఫల్యాలను  పరిష్కారించే సామర్ధ్యం వారికి రావాలని కోరుకుంటున్నా . నాకు చాల ఫ్లాప్స్ ఉన్నాయి, నేను వాటిని నేర్చుకున్నాటు వాళ్ళు కూడా వారి ఫ్లాప్స్ నుంచి వారు నేర్చుకోవాలని తనలాగా 

గత సంవత్సరం, నాగార్జున శోభాయమానంగా తన రెండో కుమారుడు అఖిల్ ని తొలి చిత్రం "అఖిల్"  తో తెరగేట్రం చేసారు . కానీ, అది అందరిని నిరాశపరిచింది.
  
"ఆ చిత్రం మంచి చెడో తెలిదు, కానీ మేము అందరమూ పూర్తిగా నిరాశే చెందాము. నేను, ఆ షాక్ నుంచి తేరుకోవటానికి వారాలు పట్టింది. మేము ఆ పరాజయాని అంగీకారించము , "అని  అన్నారు.                                        

నాగార్జున తన కుమారులు సినీ ఎంపికలో జోక్యం చేసుకోబోమని అని చెప్పారు అయితే, అతను ఎల్లప్పుడూ సలహాలను ఇవ్వడానికి  ఇష్టమని చెప్పారు.

"నాగచైతన్య ప్రస్తుతం మలయాళం సూపర్హిటైన “ప్రేమం”  చిత్రంను  తెలుగులో  "మజ్ను", పేరుతో రీమేక్  చేస్తున్నారు.  నేను “ప్రేమం” చూసినప్పుడు, నాకు ఒక అందమైన చిత్రంగా అనుభూతి కలిగింది, చైతన్యకు ఈ చిత్రం పరిపూర్ణంగా సరితుగుతాడు అని మేము అది రీమేక్ నిర్ణయించుకున్నాము, కానీ తనపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేదు. "

అక్కినేని త్రయం స్వర్గీయ నాగేశ్వర రావు, నాగార్జున మరియు నాగ చైతన్య 2014 లో మనంచిత్రంలో నటించారు.  మరోసారి  అలాంటి అవకాశం వస్తే తను తన కొడుకులతో నటించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.

నాగార్జున కోరుకున్న విధంగా నాగ చైతన్య మరియు అఖిల్ ఇద్దరు మనో దైర్యంతో ముందడుగు వేసుకుంటూ భవిష్యతులో విజయాలు పొందాలని అభిమానులు కోరుకుందాం.

12/20/2015

12/20/2015

ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు రంగనాథ్ స్వర్గస్థులయ్యారు

Actor Ranganath still

ప్రముఖ నటుడు రంగనాథ్ గారు నేటి సాయంత్రం కవాడిగూడ అయన నివాసంలో తుది శ్వాస విడిచారు. వారి వయసు 66 సంవత్సరాలు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రంగనాథ్ గారి పూర్తీ పేరు "తిరుమల సుందర శ్రీ రంగనాథ్", 1949 మదరాసులో జన్మించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వా విద్యాలయంలో B.A. పట్టా పొందారు. తదనంతరం భారతీయ రైల్వే లో టికెట్ కలెక్టర్ గా పని చేశారు. 


1969లో బుద్ధిమంతుడు అను  చిత్రంలో చిన్న పాత్రలో మెరిసారు. తరువాత ప్రముఖ నటుడు గిరి బాబు గారి ప్రోత్సాహంతో చందన చిత్రంలో కథానాయకుడిగా అవకాశం వచ్చింది. అలా మొదలైన ప్రస్థానం  జామిందరుగారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందామే  ఆనందం మొదలుకొని సుమారు 300 వందల చిత్రలలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ  నటుడిగా అందరి మన్ననలు పొందారు.  ఆయన చివరి చిత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర

తెలుగు చిత్రాలతోనే పరిమితం కాకుండా బుల్లి తెరలోను తన ఉనికి చాటుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం మొదలు కొని, ఇద్దరు  అమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో ధారావాహికం లో నటించారు. 


రంగనాథ్ గారు నటనలో బిజీగా  ఉన్న వారు అటతుగా ఇవాళ సాయంత్రం మృతి చెందారు. వారు ఆత్మాహత్య చేసుకున్నారు. వారు చనిపోవటం చలనచిత్ర నటులు ఆత్మీయులను కోల్పోయాము అని దిగ్బ్రాంతి చెందుతున్నారు. వారికి మృతికి సిని పెద్దలు, సిని మండలి ప్రగడ సంతాపం తెలుపుతున్నారు. వారితో పాటు మా తెలుగు చిత్రా కూడా మహా నటుడికి ఘన నివాళి. 


 ..  తన ఆత్మ శాంతి కలగాలని తెలుగు చిత్రా దేవుని ప్రార్ధిస్తుంది ..

12/18/2015

12/18/2015

'దిల్ వాలే': సినిమా కేవలం షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ ✯✯3/4



Dilwale Logo
దిల్ వాలే: సినిమా షారుఖ్ ఖాన్ మరియు కాజోల్  ✯✯3/4 

బ్యానర్స్: చిల్లీస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ మరియు రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్
తారాగణం: షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ సంజయ్ మిశ్రా, వరుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, ముఖేష్ తివారి
సంగీతం: అమర్ మొహిలే పాటలు: ప్రీతమ్ చక్రవర్తి
సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య  సినిమాటోగ్రఫీ: డడ్లీ
నిర్మాత: గౌరీ ఖాన్ షారుఖ్ ఖాన్, రోహిత్ శెట్టి  దర్శకుడు: రోహిత్ శెట్టి


ముందుగా:  
దిల్ వాలే ప్రధాన ఆకర్షణ షారుఖ్ ఖాన్ మరియు కాజోల్. సుదీర్ఘ విరామం తర్వాత  "దిల్ వాలే" తో మనని అలరించటానికి వచ్చారు. ఈ చిత్రం చూడటానికి ప్రధాన కారణం కూడా వాలే. ఈ దిల్ వాలే జంట నుంచి మ్యాజిక్ ఆశించటం సహజం. మరి వారు ఆ మ్యాజిక్ చేసారా లేక నిరాశ పరిచారా చూడం.

కథ: 
రాజ్ (షారుఖ్ ఖాన్) aka కాళీ తన ప్రియమైన తమ్ముడు వీర్ (వరుణ్ దవన్) మరియు తన ఇద్దరు స్నేహితులు అన్వర్ (పంకజ్ త్రిపాఠి) మరియు శక్తి (ముఖేష్ తివారి) తో తన 15 సంవత్సరాల జీవిత అంతర్గత రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా ఒక ప్రశాంతమైన జీవితం సాగిస్తాడు. రాజ్ తన తమ్ముడితో కలిసి పాత కార్లను మరమత్తు చేసి వాటిని కొత్తదానిలా తయారు చేసే గ్యారేజీ నడుపుతుంటాడు.  వీర్ కి ఒక స్నేహితుడు సిద్ధూ (వరుణ్ శర్మ) మరియు మణి (జానీ లీవర్) తో కలిసి అల్లరి చేస్తూ అన్న అంటే అభిమానం తో జీవితాని ఎంజాయ్ చేస్తుంటాడు.

అలా వాళ్ళ జీవితాలు సాఫీగా నడుస్తున్న సమయములో,  ఇషిత (కృతి సనన్) వీర్ జీవితం లో కి వస్తుంది. ఇషిత చూసి మనసు పారేసుకొని వీర్, తన స్నేహితులు సిద్దు మరియు మణితో కలిసి ఇషితను కూడా తనను  ప్రేమించేలా చేసుకుంటాడు. అలా ప్రేమలో ఉన్న వీరికి వారదిల మీరా (కాజోల్) ఇషిత అక్క వస్తుంది. కారణం వీర్ రాజ్ తమ్ముడు అని కారణం. మీరా ఎవరు వాళ్ళిద్దరి మధ్య వారది ఎందుకు అయింది. ఇంతకీ మీరాకు రాజ్  మధ్య సంబంధం ఏంటి అనేదే కథ....?


కళాకారుల నటన:  
ముందుగా చెప్పుకోవాల్సింది మన హీరో షారుఖ్ ఖాన్, ఇందులో రాజ్ గా మరియు కాళీ గా జీవించేసాడు. అతని నటనతో ఈ చిత్రం మొత్తని తన  భుజాలపై  మోసాడు. ఇక అతని ప్రేమిక మన మీరాగా నటించిన కాజోల్ మరియు వారి జంట మనసు పులకింప చేసింది. 

షారుఖ్ ఖాన్ సరితూగ నటించిన 1990 బ్యాక్ డ్రాప్ లో కొన్ని చోట్ల ఇద్దరి మధ్య మెరుపు మరియు కొంచెం నీరాసించింది.

వీర్ గా  వరుణ్  తన నటన శక్తిని  నీరు కార్చెసాడు మరియు చాలా సన్నివేశాల్లో అతి ప్రదర్శించాడు. అతని మూస ధోరణి తమ్ముడి పాత్ర లో కొత్తదనం లోపించింది.

కీర్తి సనన్ ఇషితగా , వీర్ ప్రేయసిగా గట్టిగానే తన ఉనికిని చాటుకుంది. ఆమె సహజమైన అందాలూ ప్లస్ అయ్యాయి.

వరుణ్ శర్మ, ఒక నిరాశ  పరిచే పాత్ర పోషించాడు. మణిగా  జానీ లీవర్, తన అసాధారణ నటన శైలిలో అలరించాడు. ఆస్కార్గా సంజయ్ మిశ్రా, అతను ఏదో ఒక కొత్తగా  తెరపై ప్రతిసారీ ప్రదర్శిస్తూ ఉంటారు.  రాజుగా బోమన్ ఇరానీ, ఒక హాస్య ఆవతరం మార్క్ తీసుకొచ్చారు, కానీ వారి మధ్య హాస్యం ఒక అల్పమైన మూస దోరణి వచ్చింది. బల్గేరియా డాన్ రణ్ధీర్ బక్షి గా వినోద్ ఖన్నా, పాత్ర వ్యర్థ పూరితం.

సాంకేతిక విశేషాలు: 
రోహిత్ శెట్టి ఈ చిత్రానికి పూర్తీ న్యాయం మరియు పూర్తిగా నటులను ఉపయోగించలేకపోయడు. కాని కింగ్ ఖాన్ రోహిత్ శెట్టి కలయిక వలన ఒక మెగా వినోదం ఆశించే వాళ్ళకు కొంత నిరాశే మిగులుతుంది.
1990 బ్యాక్ డ్రాప్ కథ, సెట్టింగ్స్ వాటి సంబంధించిన  కథనం అంత బోర్ కొట్టిస్తుంది. ఇక్కడ దర్శకుడిగా తన ప్రదర్శన మరియు సత్తా చాటలేక పోయాడు.

సంగీతం కోస్తే  ప్రీతం, అమర్ మొహిలే నిరాశే.

సాంకేతికాని ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది.

కానీ సినిమాటోగ్రాఫర్ డడ్లీ నీ మెచ్చుకోవాలి. బల్గేరియ అందాల్ని మరియు "Gerua" పాట చిత్రీకరణను అందంగా చిత్రీకరించారు. పోరాట సన్నివేశాలు ఒకే.

మొత్తానికి "దిల్ వాలే" షారుక్ ఖాన్ కాజోల్ అభిమానులకు నచ్చుతుంది  ఉంది. మిగత వారికీ ఒక సాధారణ చిత్రంగా అనిపిస్తుంది.


11/30/2015

11/30/2015

త్వరలో ఇంటివాడు కాబొతున్న#@IamVarunSandesh హీరో వరుణ్ సందేశ్.....

త్వరలో ఇంటివాడు కాబొతున్న#@IamVarunSandesh  హీరో వరుణ్ సందేశ్.....    

Varun Sandesh

ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి గారి మనవడు మన తెలుగు చిత్ర నవ మన్మధుడు అమ్మాయి కలల రాకుమారుడు మన వరుణ్ సందేశ్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ప్రముఖ బుల్లితెర నటుడు జీడిగుంట శ్రీదర్ సోదరాకుమారుడు మన వరుణ్ సందేశ్.

వరుణ్ సందేశ్, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "హ్యాపీ డేస్" అనే చిత్రంతో వెండితెర ప్రస్థానం మొదలైంది. మొదటి సినిమాతో పాటు వరుసగా హట్రిక్ కొట్టి విజయ పరంపరలో దూసుకుపోతూ ఉన్న మనవాడు పడ్డానండి ప్రేమలో మరి చిత్రంతో ఆ చిత్ర కథానాయక వితిక శేరు తో నిజ జీవితం లో కూడా ప్రేమలో పద్దదండి వారి ప్రేమ ఆకురం ఆ చిత్రం తో మొదలయి దిన దిన అభివృది చెందుతూ డిసెంబర్ 7వ తేదిన  సినీ మరియు బందు మిత్ర పెద్దల సమక్షలో జరుగు నిశ్చితార్ధంతో ఒకటి కాబోతున్నారు. వారి జంట కలకలం ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇద్దరినీ తెలుగు చిత్రా శుభాకాంక్షలు తెలియచెయుచున్నది.

8/08/2015

8/08/2015

నాని "భలే భలే మగాడివోయ్" ఫస్ట్ లుక్

మెమరీ నిల్, ఎంటర్టైన్మెంట్ ఫుల్ అని కాప్షన్ తో వస్తున్నాడు మన నాని UV Creations మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తా బ్యానర్ పై "భలే భలే మగాడివోయ్" అంటూ. UV క్రియేషన్స్ బ్యానర్ వారి నాల్గవ హిట్ కుటుంబ ప్రేమ కథ చిత్రంగా దసరా కానుకగా మనని అలరించటానికి వస్తున్నా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ &  ఫోటో  స్టిల్స్ ఈ మధ్య రిలీజ్ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ & ఫోటో స్టిల్స్ మీ కోసం మీ తెలుగుచిత్రాలో .

Bhale Bhale Magadivoy Stills